సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, జిక్కి
శంకరాభరణం::రాగం
(హరికాంభోజి)
పల్లవి::
చిలకా గోరింకా..కులికే పకాపకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నావంక
చిలకా గోరింకా..కులికే పకాపకా
నీవే చిలకైతే నేనే గోరింకా రావా నావంక
చరణం::1
చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలూ కన్నట్టి కలిమి లభించెనే
చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలూ కన్నట్టి కలిమి లభించెనే
మనసే నిజమాయే తనువులు ఒకటాయే
మదిలో తలంపులే తీరే తీయగా
మారే హాయిగా..
చిలకా గోరింకా..కులికే పకాపకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నావంక
చరణం::2
కలికీ నీవిలా ఎదుట నిలబడ
పలుకే బంగారం ఒలికే వయ్యారమే
కలికీ నీవిలా ఎదుట నిలబడ
పలుకే బంగారం ఒలికే వయ్యారమే
ఒకటే సరాగము ఒకటే పరాచికం
కలసి విహారమే చేద్దాం హాయిగా
నీవే నేనుగా...
చిలకా గోరింకా..కులికే పకాపకా
నీవే చిలకైతే నేనే గోరింకా రావా నావంక
చిలకా గోరింకా..కులికే పకాపకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నావంక
No comments:
Post a Comment