సంగీతం::ఆదినారాయణ రావు
రచన::సముద్రాల
గానం::జిక్కి
ఆభేరి::రాగం::( భీంపలాస్ :: రాగం )
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జీవితమే సఫలము..జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము..రాగసుధా భరితమూ
ప్రేమ కధా మధురమూ..జీవితమే సఫలమూ
రాగసుధా భరితమూ..ప్రేమ కధా మధురమూ
జీవితమే సఫలమూ.......
చరణం::1
హాయిగా తీయగా ఆలపించు పాటలా
హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
అనారు పూలతోటలా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అనారు పూలతోటలా..ఆశ దెలుపు ఆటలా
జీవితమే సఫలమూ..రాగసుధా భరితమూ
ప్రేమ కధా మధురమూ..జీవితమే సఫలమూ
చరణం::2
వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా
వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా
అంతులేని వింతలా..అనంతప్రేమ లీలలా
అంతులేని వింతలా..అనంతప్రేమ లీలలా
వరించు భాగ్యశాలలా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వరించు భాగ్యశాలులా..తరించు ప్రేమ జీవులా
జీవితమే సఫలమూ..రాగసుధా భరితమూ
ప్రేమ కధా మధురమూ..జీవితమే సఫలమూ
ఈ జీవితమే సఫలమూ
No comments:
Post a Comment