Sunday, July 29, 2012

కాలం మారింది--1972




సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరధి
గానం::S.రాజేశ్వర రావ్

తారాగణం::శోభన్‌బాబు,శారద,గుమ్మడి,అంజలీదేవి,చంద్రమోహన్,సూర్యకాంతం,గీతాంజలి,అల్లురామలింగయ్య.

పల్లవి::

మారలేదులే ఈ కాలం..మారలేదులే ఈ లోకం
మారలేదులే ఈ కాలం..మారలేదులే ఈ లోకం
దీనులకు..హీనులకు
దీనులకు హీనులకు..తీరలేదులే ఈ శోకం

చరణం::1

అందరిలో ఉండేది..ఒకే రక్తమైనా
అందరిని సృష్టించింది..ఒకే దైవమైనా
అందరిలో ఉండేది..ఒకే రక్తమైనా
అందరిని సృష్టించింది..ఒకే దైవమైనా
కులం పేరుతొ మతం ముసుగులో
ప్రాణమున్న మనిషినే..సమాధి చేసారు
సమాధి చేసారు...

చరణం::2

వారే నీ వారు..అనాధలు అభాగ్యులు
వారే నీ బంధువులు..బాధితులు పీడితులు
కంటి నీటితోనే...
కంటి నీటితోనే తమ..కడుపులను నింపుకునే
అంటరానివారు..వారే నీ వారు..
ఈ కోవెలలో ఇక..నీకు చోటు లేదమ్మా
ఈ లోగిలిలో ఇక..నిలువ నీడ లేదమ్మా


Kaalam Maarindi--1972
Music::S.Rajeswara rao
Lyricis::Dasarathi 
Singer's::S.Rajeswara Rao

::::::::

maaraledule ee kaalam maaraledule ee lokam
maaraledule ee kaalam maaraledule ee lokam
deenulaku...heenulaku
deenulaku heenulaku teeraledule ee shokam

::::1

andarilo undedi oke raktamainaa
andarini srustinchindi oke daivamainaa
andarilo undedi oke raktamainaa
andarini srustinchindi oke daivamainaa
kulam peruto matam musugulo
praanamunna manishine samaadhi chesaare
samaadhi chesaare

::::2

vare ne varu anadhalu abhagyulu
vare ne bandhuvulu badhitulu peeditulu
kanti neetitone
kanti neetitone tama kadupulanu nimpukune
antaraanivaru..vaare nee varu
ee kovelalo ika neku chotu ledammaa

ee logililo ika niluva needa ledammaa

No comments: