Saturday, July 28, 2012

సంతానం--1955:::కల్యాణి ::: రాగం




సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి
రచన::అనిశెట్టి .. పినిశెట్టి
గానం::ఘంటసాల
కల్యాణి ::: రాగం

పల్లవి::


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చల్లని వెన్నెలలో..చల్లని వెన్నెలలో..ఓ..ఓ..ఓ..
చల్లని వెన్నెలలో..చక్కని కన్నె సమీపములో....
చల్లని వెన్నెలలో..చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే..ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో.....

చరణం::1

తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి..తేలి ఆడెనే ముద్దులలో
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి..తేలి ఆడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన..గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో..ఓ..ఓ..చల్లని వెన్నెలలో…
చక్కని కన్నె సమీపములో..అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే..చల్లని వెన్నెలలో

చరణం::2

కళకళలాడే కన్నె వదనమే కనిపించును..ఆ తారలలో ఓ..ఓఓ..ఓఓఓ..ఓఓ..
కళకళలాడే కన్నె వదనమే కనిపించును..ఆ తారలలో
కలకాలము నీ కమ్మని రూపము..కలకాలము నీ కమ్మని రూపము
కలవరించునలే నా మదిలో..ఓ..ఓ..చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో..ఓ..అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే....చల్లని వెన్నెలలో

No comments: