Saturday, July 28, 2007

కాలం మారింది--1972




సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరధి
గానం::ఘంటసాల,P.సుశీల


పల్లవి::

పల్లె నిదురించేను..తల్లి నిదురించేను
ప్రతి పాప తల్లి పొత్తిళ్ళ నిదురించేను
ఎవరికి నీవు కావాలి
ఎవరికి నీ మీద జాలి..ఈ..ఈ..ఈ..ఈ..

ఏ తల్లి పాడేను జోల..ఏ తల్లి ఊపేను డోల
ఎవరికి నీవు కావాలి..ఎవరికి నీ మీద జాలి
ఏ తల్లి పాడేను జోల..ఏ తల్లి ఊపేను డోల

చరణం::1

నీ ఇల్లు కొండలో కొనలో
నీ బ్రతుకు ఎండలో వానలో
కొండలో కొనలో ఎండలో వానలో
లోకానికే నీవు దూరం..లోకాల తల్లికే భారం
ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి ఊపేను డోల

చరణం::2

కలువ పాపాయికి..కొలను ఒడి ఉన్నది
చిలుక పాపాయికి..చిగురు ఒడి ఉన్నది
కలువ పాపాయికి..కొలను ఒడి ఉన్నది
చిలుక పాపాయికి..చిగురు ఒడి ఉన్నది
ప్రాణమే లేని ఒక..శిలకు గుడి ఉన్నది
పాపా నీకే అమ్మ ఒడి లేనిది గుడి లేనిది
ఏనాడు చేసావో పాపం..నీకు ఏనాటిదీ ఖౄర శాపం
ఎవరికి నీవు కావాలి..ఎవరికి నీ మీద జాలి
ఏ తల్లి పాడేను జోల..ఏ తల్లి....

No comments: