Saturday, July 28, 2007

మిస్సమ్మ--1955:::ఖమాస్:::రాగం







సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::పింగళి

గానం::P.లీల

ఖమాస్:::రాగం
ఈ రాగంలో బేహాగ్,కల్యాణి
చాయలు ఉన్నాయి కాబట్టి హిందుస్తానీ ఛాయనాట్ దగ్గరగ ఉంది 


తెలుసుకొనవే చెల్లి..అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
మగవారికి దూరముగ..మగువలెపుడు మెలగాలని
మగవారికి దూరముగ..మగువలెపుడు మెలగాలని
తెలుసుకొనవే చెల్లి..అలా నడుచుకొనవే చెల్లీ

మనకు మనమె వారికడకు..పని ఉన్న పోరాదని..ఆ ఆ ఆ
మనకు మనమె వారికడకు..పని ఉన్న పోరాదని
అలుసు చేసి నలుగురిలో..చులకనగ చూసెదరని
అలుసు చేసి నలుగురిలో..చులకనగ చూసెదరని

తెలుసుకొనవే చెల్లి..అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి..

పదిమాటలకొక మాటయు..బదులు చెప్పకూడదని..ఆ ఆ ఆ
పదిమాటలకొక మాటయు..బదులు చెప్పకూడదని
లేని పోని అర్ధాలను..మన వెనుకనె చాటెదరని
లేని పోని అర్ధాలను..మన వెనుకనె చాటెదరని

తెలుసుకొనవే చెల్లి..అలానడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి..

No comments: