సంగీతం::మాస్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::P. సుశీల
పల్లవి::
మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా
మీ దేహములో చిరు లోపములున్నా ప్రేమ కరువగునా

చరణం::1
సింహము కాల్ళు చిక్కుపడిననూ శౌర్యము కొరవడునా

చేతలు మాటలు ఒకటే అయితే త్యాగము కరువగునా
త్యాగము కరువగునా
మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా
మీ దేహములో చిరు లోపములున్నా ప్రేమ కరువగునా
చరణం::2
కాళ్ళే లేని కమ్మని చంద్రుడు నిరతము పయనించునే

కరములు చాపే కలువను చేరి ముదము కలిగించునే
ముదము కలిగించునే
మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా
మీ దేహములో చిరు లోపములున్నా ప్రేమ కరువగునా
చరణం::3
పతి పదసేవా భాగ్యము నేనే సతతము నోచితినీ
పతి పదసేవా భాగ్యము నేనే సతతము నోచితినీ
మీ చల్లని మదిలో సౌఖ్యములొసగే స్వర్గము చూచితిని
స్వర్గము చూచితిని
మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా
మీ దేహములో చిరు లోపములున్నా ప్రేమ కరువగునా
No comments:
Post a Comment