సంగీతం::K.చక్రవర్తి
రచన::వేటూరి గారు
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
సంస్థ:::రోజా మూవీస్
గాత్రం:::S.P.బాలు,P.సుశీల
Film Directed by::K.Raghavendra Rao
తారాగణం::N.T.రామారావు,జయంతి,శ్రీదేవి కపూర్,మోహన్‌బాబు,గీత,రావ్‌గోపాల్‌రావ్,
కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నాగేష్,చలపతిరావ్,సుత్తివీరభద్రరావ్,జగ్గారావ్.
పల్లవి::
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా ఇంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే
నీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
చరణం::1
గోరంత పసుపు నీవడిగినావు
నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం
త్యాగాలమయమై సంసారబంధం
నీ చేయి తాకి చివురించె చైత్రం
ఈ హస్తవాసే నాకున్న నేస్తం
అనురాగ సూత్రం
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా ఇంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు మీడే
మీ కంట తడిని నే చూడలేను
చరణం::2
మా అమ్మ నీవై కనిపించినావు
ఈ బొమ్మనెపుడో కదిలించినావు
నిను చూడగానే పొంగింది రక్తం
కనుచూపులోనె మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీకదీపం
దైవాలకన్న దయ ఉన్న రూపం
ఈ ఇంటి దీపం
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా ఇంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు మీడే
మీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా ఇంట వెలిగే గృహలక్ష్మి నీవే
No comments:
Post a Comment