Thursday, June 07, 2012

బావా మరదళ్ళు--1961::ఆభేరి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::ఆరుద్ర
గానం::S. జానకి

అభేరి :: రాగం 

( భీం పలాశ్రీ )


ఆ ఆ ఆ


నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి మేఘాలలో

ఏ పూర్వపుణ్యమో నీ పొందుగామారి
ఏ పూర్వపుణ్యమో నీ పొందుగామారి
అపురూపమై నిలిచే నా అంతరంగాన

నీలి మేఘాలలో

నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు
నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరిపింపజేయూ

నీలి

అందుకోజాలని ఆనందమే నీవు
అందుకోజాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు

నీలి మేఘాలలో

No comments: