Wednesday, June 20, 2012
గుప్పెడుమనసు--1979
సంగీతం::M.S.విశ్వనాధన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా
నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా
నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
నువ్వేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా
చరణ్మ్::2
కళ్ళేనా...
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
తుళ్ళితుళ్ళిపడు వయసేనా నను తొందరవందర చేసేనా
తుళ్ళితుళ్ళిపడు వయసేనా నను తొందరవందర చేసేనా
నువ్వేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా
చరణం::3
ఆ ఆ ఆ ఆ ఆ
నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడౌనా
నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడౌనా
మళ్లీమళ్లీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
మళ్లీమళ్లీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
Labels:
గుప్పెడుమనసు--1979
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment