సంగీతం::T.V.రాజు
రచన::కోసరాజు
గానం::మాధవపెద్ది..L.R.ఈశ్వరీ
పల్లవి::
నిండు అమాసా నిసిరేతిరి కాడ...
నిండు అమాసా నిసిరేతిరి కాడ ఎక్కడకెళతావు మావో నీవు
నీవు ఏమై పోతవు మావో
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఎటుబోతే నే ఏమైతేనేం... ఎటుబోతే నే ఏమైతేనేం
ఎంటబడకు ఓ భామో..నన్నేడిపించకే భామోవ్
చరణం::1
కళ్ళలో కారం గొట్టిపోతివా..కంతిరి జేసి దాటిపోతివా
కాళ్ళకు మెడకు కట్టేస్తానోయ్..నెత్తిన రెండు మొట్టేస్తానోయ్
నిండు అమాసా నిసిరేతిరి కాడ ఎక్కడకెళతావు మావో నీవు
నీవు ఏమై పోతవు మావో
చరణం::2
చూపులు చూస్తే ఊపుగ ఉన్నాయ్..మాటలు చూస్తే జోరుగ ఉన్నాయ్
పోతుకోలుగా తలచేనేమో..మీసమున్న మగధీరుడనేలే
ఓహో.......ఓహోహోహ్...
నిండు అమాసా నిసిరేతిరి కాడ ఎక్కడకెళతావు మావో నీవు
నీవు ఏమై పోతవు మావో
చరణం::3
జెట్ట బెట్టా జానెడు లేవు..ఉల్లిపాయవలె ఎగిరిపడేవు
ఉల్లిపాయలో ఉన్నది కారం..ఎరగవు ఏమో నా అవతారం
ఎటుబోతే నే ఏమైతేనేం
ఎంటబడకు ఓ భామో..నన్నేడిపించకే భామోవ్
చరణం::4
గడప దాటి నివ్ కాలు పెడితివా..ఒళ్ళు సాపుగా
గుమ్మెస్తా
గ్రహపాటు నే ఇక్కడి కొస్తే..కదలనీయదు ఈ సైతాన్
నిండు అమాసా..
నిండు అమాసా నిసిరేతిరి కాడ ఎక్కడకెళతావు మావో నీవు
ఏమై పోతవు మావో
No comments:
Post a Comment