Monday, June 20, 2011

పిడుగు రాముడు--1966

సంగీతం::T.V.రాజు
రచన::D.సినారె
గానం::P.సుశీల

పల్లవి::

మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే
ఓ ఓ ఓ..మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే

చరణం::1

కానరాని ఆకాశదీపం కనులముందే వెలిగిందిలే
కానరాని ఆకాశదీపం కనులముందే వెలిగిందిలే
మూగవోయిన రాగమాల మురిసి విరిసి పలికిందిలే

ఓ ఓ ఓ..మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే
ఓ ఓ ఓ..మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే

చరనం::2

కరిగిపోయే అందాల కలలే..తిరిగి నాలో అగుపించెలే

వాడిపోయే ఆశలన్నీ నేడే నాలో చిగురించెలే

ఓ ఓ ఓ..మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే
ఓ ఓ ఓ..మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే

చరణం::3

గుడెలోన కొలువైన స్వామి..పండునవ్వులు చిలికించెనే

చేసుకొన్నా పూజలన్ని పూచి కాచి ఫలియించెనే

No comments: