Monday, June 20, 2011

పిడుగు రాముడు--1966




సంగీతం::T.V.రాజు
రచన::D.సినారె
గానం::P.సుశీల,L.R.ఈశ్వరీ


పల్లవి::

రంగులు రంగులు రంగులు
హొయ్ రమణుల వయసుల పొంగులు

రంగులు రంగులు రంగులు
హొయ్ రమణుల వయసుల పొంగులు

చరణం::1

రాక రాక మా వాడలోకి భల్ షోకుగాడు వచ్చాడే
అహ..నాకు బాగ నచ్చాడే..

రాక రాక మా వాడలోకి భల్ షోకుగాడు వచ్చాడే
అహ..నాకు బాగ నచ్చాడే..

ఏమా అందం ఏమా చందం..ఇంక నే తాళలేనే
హోయమ్మా..

రంగులు రంగులు రంగులు
హొయ్ రమణుల వయసుల పొంగులు

రంగులు రంగులు రంగులు
హొయ్ రమణుల వయసుల పొంగులు

చరణం::2

నీటి బంటువలె మాటి మాటికి..మీసం మెలివేసాడే
సంపెంగి నూనె రాసాడే

నీటి బంటువలె మాటి మాటికి..మీసం మెలివేసాడే
సంపెంగి నూనె రాసాడే

కీచకుడైనా ఈ దొర ముందర..కీచు కీచు మంటాడే
హోయమ్మా

రంగులు రంగులు రంగులు
హొయ్ రమణుల వయసుల పొంగులు

రంగులు రంగులు రంగులు
హొయ్ రమణుల వయసుల పొంగులు

చరణం::3

చెంగు పట్టుకొని చెత చేరి..నా చెక్కిలి మీటెను చూడే
అయో సిగ్గును వదిలేసాడే

చెంగు పట్టుకొని చెత చేరి..నా చెక్కిలి మీటెను చూడే
అయో సిగ్గును వదిలేసాడే

విలాస వీరుని కులాస తీరగ..జలకాలాడిద్దామే

విలాస వీరుని కులాస తీరగ..జలకాలాడిద్దామే
హోయమ్మా...

రంగులు రంగులు రంగులు
హొయ్ రమణుల వయసుల పొంగులు

రంగులు రంగులు రంగులు
హొయ్ రమణుల వయసుల పొంగులు

No comments: