Wednesday, April 11, 2012
తూర్పు వెళ్ళె రైలు--1979
సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో
కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో.. కో....కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో
కోటేరు పట్టినోడుకో.... పూటకొడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడికో...సేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదు ఒకడికి...తిన్నది అరగదు ఒకడికి
ఆశచావదొకడికి...ఆకలాడదొకడికి
మేడిపండు మేలిమెందుకో...పొట్ట గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో...పాములొస్తే కర్రపట్టుకో...కో..
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
వేమన్న వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో...కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో
తుర్పు ఇంటి ఆంకాళమ్మ కో... కో ... పడమటింటి పోలేరమ్మ కొక్కో
... దక్షిణాన గంగానమ్మ కో.. కో .. ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా పంట చేను కాపలాకునేనుఎందుకో .. కో... కాసుకో ...
Labels:
తూర్పు వెళ్ళె రైలు--1979
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment