Wednesday, December 07, 2011

బంధవ్యాలు--1968



బంధవ్యాలు::1968
సంగీతం::సాలూరి హనుమంత రావ్
రచన::సినారె
గానం::ఘటసాల,P.సుశీల

పల్లవి::
చంద్రమోహన్::

అటు గంటల మోతలు..గణగణా
ఇటు గాజుల సవ్వడి..గలగల
అటు గంటల మోతలు..గణగణా
ఇటు గాజుల సవ్వడి..గలగల
అటు విందునా..ఇటు కందునా..
అటు విందునా..ఇటు కందునా..
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..
అటు గంటల మోతలు..గణగణా

చరణం::1
చంద్రమోహన్::

ఓ..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పంచవన్నెలరామచిలకా..పలకనైనా పలుకదేమి
కొమ్మ మాటున కోయిలమ్మా..కూయనైనా కూయదేమి
పలికితే వరహాలు రాలునా..పాడితే పగడాలు రాలునా
పలికితే వరహాలు రాలునా..పాడితే పగడాలు రాలునా
రాలితే అవి మూటకట్టి..కలకాలం దాచుకోనా
కలకాలం దాచుకోనా..

అటు గంటల మోతలు..గణగణా
ఇటు గాజుల సవ్వడి..గలగల
అటు విందునా..ఇటు కందునా..
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..
అటు గంటల మోతలు..గణగణా

చరణం::2
చంద్రమోహన్::
ఓ..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చిలిపి సిగ్గు మేలిముసుగై..చెలియమోమూ దాచెనెమో
కలికి నవ్వు వెలికి రాక..పెదవి తెరలో ఒదిగె నేమో

లక్ష్మీ::
దాచితే అది దాగునా..చెయ్ చాచితే చెలరేగునా
దాచితే అది దాగునా..చెయ్ చాచితే చెలరేగునా
నా గుండెలో ఈబండిలో..ఈ కుదుపులు ఊరెకె ఉండునా
ఈ కుదుపులు ఊరెకే..ఉండునా..

ఇద్దరు::
అటు గంటలమోతలు ..గణగణా..
ఇటు గాజుల సవ్వడి..గలగలా
అటు గంటలమోతలు ..గణగణా..
ఇటు గాజుల సవ్వడి..గలగలా
అటు విందునా..ఇటు కందునా..ఆ
అటు విందునా..ఇటు కందునా
ఆ అందం మెరిసెను మిలా మిలా
నను తొందర చేసెను ఎలా ఎలా
ఎలా ఎలా..భళా భళా..హేయ్య్..
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..
ఎలా ఎలా..భళా భళా..

No comments: