Wednesday, December 07, 2011
బంధవ్యాలు--1968
సంగీతం::సాలూరి హనుమంత రావ్
రచన::సినారె
గానం::ఘటసాల
మంచి తనానికి ఫలితం వంచన
మనిషికి మిగిలేదేమిటి వేదనా..
ఆరని తీరని వేదన ఆవేదన
మంచి తనానికి ఫలితం
అన్నగారి మది వెన్నెల తునక
తమ్ముని మనసే మీగడ తరగ
అన్నగారి మది వెన్నెల తునక
తమ్ముని మనసే మీగడ తరగ
మరదలి మమత మరువపు మొలక
మరదలి మమత మరువపు మొలక
మరి ఏల కలిగెను ఈ కలత
మంచి తనానికి ఫలితం
పచ్చగ ఎదిగే సంసారంలో
చిచ్చులు రేపెను శని ఏదో
సిరులొలికించే పాల కుండలో
గరళము కలిపేను విధి ఏదో..విధి ఏదో
మంచి తనానికి ఫలితం
పాపమనేది పాము వంటిది
బయటపడునురా ఒకనాడు
నిజమనేది నిప్పువంటిది
ౠజువౌలేరా మరునాడు
మంచి తనానికి ఫలితం వంచన
మనిషికి మిగిలేదేమిటి వేదనా
ఆరని తీరని వేదన ఆవేదన
మంచి తనానికి ఫలితం
Labels:
Singer::Ghantasaala,
బంధవ్యాలు--1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment