Tuesday, November 29, 2011

శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్--1976






సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
దర్శకత్వం::బాపు-రవణ
గానం::S.P.బాలు

నటీ,నటులు::కృష్ణ,జయప్రద,జగ్గయ్య,పద్మనాభం

పల్లవి::

నాపేరు బికారి నాదారి ఎడారి
మనసైనచోట మజిలీ
కాదన్నచాలు బదిలీ..ఈ..
నాదారి ఎడారి నాపేరు బికారి
నాపేరు బికారి నాదారి ఎడారి

చరణం::1

తోటకు తోబుట్టువును..ఏటికి నేబిడ్డను
పాటనాకు సైదోడు..పక్షినాకు తోడు
విసుగురాదు ఖుషీపోదు..వేసటలేనేలేదు
విసుగురాదు ఖుషీపోదు..వేసటలేనేలేదు
అసలునామరోపేరు..ఆనందవిహారి

నాదారి ఎడారి నాపేరు బికారి
నాదారి ఎడారి నాపేరు బికారి

చరణం::2

మేలుకొని కలలుగని..మేఘాలమేడపై
మెరుపుతీగలాంటి..నా ప్రేయసినూహించుకుని
ఇంద్రధనసు..పల్లకి ఎక్కికలుసుకోవాలని..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇంద్రధనసు..పల్లకి ఎక్కికలుసుకోవాలని
ఆకాశవీథిలో..పయనించు బాటసారి

నాదారి ఎడారి నాపేరు బికారి
నాదారి ఎడారి నాపేరు బికారి

చరణం::3

కూటికినేపేదను..గుణములలో..పెద్దను
సంకల్పం నాకు ధనం..సాహసమే నాకు బలం
ఏనాటికొ ఈగరీబు..కాకపోడు నవాబు
ఏనాటికొ ఈగరీబు..కాకపోడు నవాబు
అంతవరకు నేనొక..నిరంతర సంచారి

నాదారి ఎడారి నాపేరు బికారి
నాదారి ఎడారి నాపేరు బికారి

No comments: