Saturday, July 23, 2011

ఖైదీ no 786--1988


సంగీతం:రాజ్ కోటి
రచన:భువన చంద్ర
గానం:S.P.బాలు,S.జానకి


అ:గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
ఆ:నిన్ను నా గుండెలో మ్రోగిందిలే వీణపాట
అ:ఆడుకోవాలి గువ్వలాగా
ఆ:పాడుకొంటాను నీ జంట గోరింకనై

అ:జోడుకోసం గోడదూకే మైదిలి తెలుసుకో అమ్మాయిగారు
ఆ:అయ్యోపాపం అంతతాపం తగదులే తమరికి అబ్బాయిగారు
అ:ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఆ:ఓర్పులూ..నిట్టూర్పులూ ..అంతా నీధ్యానం
అ:కోరుకొన్నానని ఆటపట్టించకు
ఆ:చేరుకొన్నానని నన్ను దోచేయకు చుట్టుకొంటాను సుడిగాలిలా
అతడు:గువ్వా
ఆ:ఆ...
అతడు:గోరింకతో
ఆ:ఆ...
అ:అడిందిలే బొమ్మలాట
ఆ:హేయ్...నిన్నూ
అ:హా...
ఆ:నాగుండేలో
అ:హా...
ఆ:మ్రోగిందిలే వీణపాట

ఆ:కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చేసంగీతం
అ:సందెకాడ అందెగత్తె గుండెలో వుందిలే ఎంతో సంతోషం
ఆ:పూవులో మకరందమూ వుందే నీకొసం
అ:తీర్చుకో ఆదాహమూ వలపే జలపాతం
ఆ:కొంచం ఆగాలిలే కోర్కెతీరెందుకు
అ:దూరముంటానులే దగ్గరైయెందుకు
ఆ:దాచిపెడతాను నాసర్వమూ...
అ:గువ్వా..
ఆ:హాయ్
అ:గోరింకతో
ఆ:హాయ్
అ:ఆడిందిలే బొమ్మలాట
ఆ:హాయ్ నిన్నూ
అ:హ..
ఆ:నాగుండెలో
అ:హ..
ఆ:మ్రోగిందిలే వీణపాట
ఇద్దరు:ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకొంటాను నీజంట గోరింకనై....

No comments: