Saturday, July 23, 2011

మహర్షి--1987




సంగీతం::ఇళయరాజా
రచన::వెన్నెలకంటి
గానం::S.P.బాలు,S.జానకి

మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
గానమిదీ నీ ధ్యానమిదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిది

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది

ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం
నింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేల

అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
రాగల తీగల్లొ వీణానాదం కోరింది ప్రణయవేదం
వేశారు గుండెల్లొ రేగె గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తారతీరం అంతేలేని ఎంతో దూరం

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
కూడనిదీ జత కూడనిదీ
చూడనిదీ మది పాడనిదీ
చెప్పరాని చ్హిక్కుముడి వీడనిదీ

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది

No comments: