Tuesday, July 05, 2011

గృహలక్ష్మి--1967




సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::సముద్రాలరాఘవాచార్య(సీనియర్)
గానం::P.భానుమతి
తారాగణం::అక్కినేని,పి.భానుమతి,ఎస్.వి.రంగారావు,పద్మనాభం,సూర్యకాంతం,రమణరెడ్డి.

పల్లవి::

మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ
మేలుకోవయ్య

చరణం::1

తెల్లవారెనురా విహగాలి లేచెనురా
తెల్లవారెనురా విహగాలి లేచెనురా
అల్లదే ఉదయాద్రి పైన
అల్లదే ఉదయాద్రి పైన అరుణకాంతి విరిసెరా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య

చరణం::2

చల్ల చిలికే భామల కంకణాల మోతలవిగో
చల్ల చిలికే భామల కంకణాల మోతలవిగో
ఝుమ్మని నిను లెమ్మని
ఝుమ్మని నిను లెమ్మని పిలిచేను తేటి తియ్యగా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య

చరణం::3

పసిడి వాకిటిలో విరజాజి మాలలతో
పసిడి వాకిటిలో విరజాజి మాలలతో
దాసకోటి వేచినారు
దాసకోటి వేచినారు నీకు సేవలు చేయగా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య

3 comments:

Dr.Suryanarayana Vulimiri said...

శక్తి గారు, ఈ పాటలో ఒక్క పదం సరిదిద్దాలి. "జుమ్మని" బదులు "ఝుమ్మని" అని వుండాలి. సాధారణంగా కొన్ని సాఫ్ట్ వేర్ లు కొన్ని ఫాంటులను సపోర్ట్ చేయవు. "బరాహ" అనే free transliteration software ప్రయత్నించి చూడండి. మరొక చిన్న సలహా. మీ బ్లాగు లో in built PDF maker install చేస్తే ఎంతో మందికి ఉపయోగ పడుతుంది. నేను మొన్ననే www.printfriendly.com నుండి download చేసి నా బ్లాగులలో install chEsaanu.

srinath kanna said...

నమస్తే సూర్యనారాయణ గారు __/\__

మీరు చెప్పిన పదం సరిదిద్దానంది

మీరు ఇది నా బ్లాగులో in built PDF maker install

చెయ్యమన్నారు ఎందుకు??

నాకు ఈ కంప్యుటర్ గురించి అంత తెలియదులేండి

అందుకే అడుగుతున్నాను

ఇమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి.

Dr.Suryanarayana Vulimiri said...

శక్తి గారు, ఇన్ బిల్ట్ PDF వలన మీ పాటల పేజీ ని ప్రింట్ చేసుకోవడానికి అనువుగా download చేసుకోవచ్చు. అది నా వంటి గాయకులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ పేజిలో మీ వెబ్ సైటు యొక్క అడ్డ్రసుతో సహా చూపుతుండి. ఒక విధంగా ఆ క్రెడిట్ మీకే. నా బ్లాగుకు వెళ్ళి ప్రయత్నించండి. కాని ఇది సూచన మాత్రమే. బలవంతం ఏమీ లేదు. నా ఇ-మెయిలు అడ్డ్రసు suryvulimiri@gmail.com