Tuesday, July 05, 2011

బాబు--1975




సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల


ఓయమ్మా ఎంతలేసి..సిగ్గొచ్చిందీ
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ
ఓయమ్మా ఎంతలేసి..సిగ్గొచ్చిందీ
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ
బూరెలాంటి బుగ్గల్లో ఎరుపొచ్చిందీ..
పువ్వులాంటి కన్నుల్లో మెరుపొచ్చిందీ
మూ..ఛి పో..ఓయమ్మో..
ఓయమ్మా ఎంతలేసి..సిగ్గొచ్చిందీ
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ

దాచుకొమ్మ ఈ వగలూ..కాచుకొమ్మ కొన్నాళ్ళు
దాచుకొమ్మ ఈ వగలూ..కాచుకొమ్మ కొన్నాళ్ళు
తప్పదులే తలంబ్రాలూ..ఆపైన తురుణాళ్ళు..
తలచుకొని తలచుకొని..నిదుర రాని నీ కళ్ళు
తలచుకొని తలచుకొని..నిదుర రాని నీ కళ్ళు
చల్లారిపోతాయి చెంగల్వ రేకులు..
చల్లారిపోతాయి చెంగల్వ రేకులు..
మూచ్..అబ్భా ఓరుకో..ఓయమ్మో..
ఓయమ్మా ఎంతలేసి..సిగ్గొచ్చిందీ
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ

పూలజడ వేసుకొని..బుగ్గచుక్కపెట్టుకొనీ
పూలజడ వేసుకొని..బుగ్గచుక్కపెట్టుకొనీ
బోలెడన్ని ఆశలతో..బోధపడని బెదరుతో..ఒ..
తడపడుతు గదిలోకి అడుగుపెట్టగానే..
తడపడుతు గదిలోకి అడుగుపెట్టగానే..
ఇలా..అబ్భా..వాటేసుకొంటాడు..వాటమైన మొనగాడు
వాటమైన మొనగాడు..మూచ్..చీపో..ఓయమ్మో..
ఓయమ్మా ఎంతలేసి..మ్మ్..సిగ్గొచ్చిందీ..అబ్బబ్బబ్బా..
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ
ఓయమ్మా ఎంతలేసి..మ్మ్..సిగ్గొచ్చిందీ

No comments: