Sunday, January 02, 2011

సంసారం సాగరం--1974

సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సుంకర సత్యనారాయణ 
గానం::S.P.బాలుP.సుశీల
తారాగణం::S.V.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ,రోజారమణి,చంద్రమోహన్. 

పల్లవి::

యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు     

చరణం::1

ఒకటి ఒకటి రెండూ..నింగి నేల రెండూ 
పగలూ రేయీ రెండూ..కంటికి రెప్పలు రెండూ
యింటికి యిద్దరు...నిండూ 
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు

చరణం::2

ఎదిగే పిల్లల కదిలే పెదవులు..ఎదలో ఆశలు చిలకాలి 
ఎదిగే పిల్లల కదిలే పెదవులు..ఎదలో ఆశలు చిలకాలి 
ఆశల బడిలో అ ఆ లు నేర్చి..ఆశయాల గుడికట్టాలి
యింటిపేరు...నిలబెట్టాలి         
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ.. పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు

చరణం::3

ఆలుమగల అనురాగం..ఆనందానికి ప్రతిరూపం
ఆనందం నిండిన ఈ బ్రతుకే..కలకాలమిలా నిలవాలి
యిల్లే స్వర్గం...కావాలి       
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు

No comments: