Sunday, November 13, 2011

జీవన తీరాలు--1977

చిమ్మట లోని ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల

Film Directed By::G.V.Shekhar
తారాగణం::శివాజీ గణేశన్,కృష్ణంరాజు,వాణిశ్రీ,కొంగర జగ్గయ్య,జయసుధ,గుమ్మడి వెంకటేశ్వరరావు,కాంతారావు,నిర్మల,రావి కొండలరావు

పల్లవి::

ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
ఏ రాగమనే పాడను..ఏ తీగ నే మీటను
ఏ రాగమనే పాడను..ఏ తీగ నే మీటను
ఎదుట రూపమే..ఎదను దీపమై
నుదుట తిలకమై..మెరిసిన వేళా
నవరస..కన్నడ..వసంత..వరాళి
మోహన..కల్యాణి..ఆనందభైరవి..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఏ రాగమనే పాడను..ఏ తీగ నే మీటను

చరణం::1

మోగవేదనకు రాగాలన్నీ..ముద్దుమాటలని తెలుసు
రాగమేదినే ఆలపించినా..యోగమిదేనని తెలుసు
మోగవేదనకు రాగాలన్నీ..ముద్దుమాటలని తెలుసు
రాగమేదినే ఆలపించినా..యోగమిదేనని తెలుసు

తెలిసి తెలిసి ఏ తీగమీటినా..తెల్లవారదా నా బ్రతుకు
తెలిసి తెలిసి ఏ తీగమీటినా..తెల్లవారదా నా బ్రతుకు
నీ చల్లని నవ్వుల వెన్నెలలే..నా సిగను పూవులై విరిసినవేళా

నవరస..కన్నడ..వసంత..వరాళి..
మోహన..కల్యాణి..ఆనందభైరవి..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఏ రాగమనే పాడను..ఏ తీగ నే మీటను

చరణం::2

వయసు వసంతాలాడిన నాడు..మనసు మోడుగా మిగిలింది
ఎడారి దారుల నడచిన నాడు..ఎదలో కోయిల పలికింది
వయసు వసంతాలాడిన నాడు..మనసు మోడుగా మిగిలింది
ఎడారి దారుల నడచిన నాడు..ఎదలో కోయిల పలికింది

గతము తలచి నా గతికి వగచి..నే నున్న వేళ నాకున్నావు
గతము తలచి నా గతికి వగచి..నే నున్న వేళ నాకున్నావు
నీ చల్లని చూపుల పల్లవితో..నా బ్రతుకు పాటగా మారిన వేళా

ఏ రాగమనే పాడను..ఏ తీగనే మీటను
ఎదుట రూపమే ఎదను దీపమై
నుదిటి తిలకమై మెరిసిఉన వేళా

నవరస కన్నడ..వసంత..వరాళి
మోహన..కల్యాణి..ఆనందభైరవి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: