Sunday, July 24, 2011

అంకుశం--1989
























సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
పండిన కలలకు శ్రీరస్తూ 
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి 
కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
పండిన కలలకు శ్రీరస్తూ 
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి 
కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ

చరణం::1

కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ
పారాణి మిసమిసలు పదములకు తెలుసూ
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ
చిగురుటాశల చిలిపి చేతలూ పసిడిబుగ్గల 
పలకరింపులూ పడుచు జంటకే తెలుసూ

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
పండిన కలలకు శ్రీరస్తూ 
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి 
కలకాలం వైభోగమస్తూ
కలకాలం వైభోగమస్తూ

చరణం::2

ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారికి చిరునవ్వె శ్రీమతికి అందం
మింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం
జన్మజన్మల పుణ్యఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే 
అలుమగలకూ..అందం

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
పండిన కలలకు శ్రీరస్తూ 
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి 
కలకాలం వైభోగమస్తూ

కలకాలం వైభోగమస్తూ

No comments: