Wednesday, July 20, 2011

ముద్దమందారం --- 1981


సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::బాలు,S.జానకి

అలివేణీ ఆణిముత్యమా..నీ కంట నీటి ముత్యమా
ఆవిరి చిగురో..ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వూ జాజి దండలో

అలివేణీ ఆణిముత్యమా..నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో జాజి మల్లీ పూల గుండెలో

అలివేణీ ఆణి ముత్యమా..

కుదురైన బొమ్మకీ..కులుకు మల్లె రెమ్మకీ
కుదురైన బొమ్మకీ..కులుకు మల్లె రెమ్మకీ
నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా..వద్దంటే ఒట్టుగా
అందాల అమ్మకీ..కుందనాల కొమ్మకీ
అందాల అమ్మకీ..కుందనాల కొమ్మకీ
అడుగు మడుగులొత్తనా మెత్తగా..అవునంటే తప్పుగా

అలివేణీ ఆణి ముత్యమా..
నా పరువాల ప్రాణ ముత్యమా..

పొగడలేని ప్రేమకీ..పొన్న చెట్టు నీడకీ
పొగడలేని ప్రేమకీ..పొన్న చెట్టు నీడకీ
పొగడ దండలల్లుకోనా పూజగా..పులకింతల పూజగా
తొలి జన్మల నోముకీ..దొర నవ్వుల సామికీ
తొలి జన్మల నోముకీ..దొర నవ్వుల సామికీ
చెలిమై నేనుండి పోనా చల్లగా..మరు మల్లెలు చల్లగా

అలివేణీ ఆణిముత్యమా..
నీ కంట నీటి ముత్యమా..
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో జాజి మల్లీ పూల గుండెలో

అలివేణీ ఆణిముత్యమా..
అలివేణీ ఆణిముత్యమా..

No comments: