సంగీతం::రమేష్‌నాయుడు
రచన::
గానం::బాలు
మందారం..ముద్దు మందారం
మందారం..ముద్ద మందారం
ముద్దుకే ముద్దొచ్చే..మువ్వకే నవ్వొచ్చే
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్విందీ సింగారం
ముద్ద మందారం..ముగ్ధ శృంగారం
ముద్ద మందారం..ముగ్ధ శృంగారం
అడుగులా..అష్ఠపదులా
నడకలా..జీవ నదులా
అడుగులా..అష్ఠపదులా
నడకలా..జీవ నదులా
పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్ళు
విరివాలు జడ కుచ్చుల సందళ్ళు
కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్విందీ సింగారం
ముద్ద మందారం..ముగ్ధ శృంగారం
ముద్ద మందారం..ముగ్ధ శృంగారం
పలుకులా..రాచిలకలా
అలకలా..ప్రేమ మొలకలా
పలుకులా..రాచిలకలా
అలకలా..ప్రేమ మొలకలా
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా కాదు మరుల మారాణి
బంతిపువ్వా పసుపు తాను పారాణి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్విందీ సింగారం
ముద్ద మందారం..ముగ్ధ శృంగారం
ముద్ద మందారం..ముగ్ధ శృంగారం.
No comments:
Post a Comment