Monday, July 18, 2011
ఈడూ-జోడు--1963
సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
ఇదేమి లాహిరీ..ఇదేమి గారడీ
ఎడారి లోన పూలు పూచి ఎంత సందడి
ఇదేమి లాహిరీ..ఇదేమి గారడీ
ఎడారి లోన పూలు పూచి ఎంత సందడి
కోరుకున్న చిన్నదాని నవ్వూ
కోటి కోటి పరిమళాల పువ్వూ
ఆ..చిన్ననాటి సన్నజాజి చెలిమి..
కన్నులందు దాచుకున్న కలిమి
ఆ నాటి కూరిమీ చలువలోనే వేడిమి
ఆ నాటి కూరిమీ చలువలోనే వేడిమి
అనురాగపు మేలిమీ
ఇదేమి లాహిరీ..ఇదేమి గారడీ
ఎడారి లోన పులు పూచి ఎంత సందడి
ఇదేమి లాహిరీ...
రామచిలక ప్రేమమాట పలికే
రాజహంస లాగ నడిచి కులికే
ఆ..గోరువంక చిలుకచెంత వాలే కొసరి కొసరికన్నెమనసునేలే
కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి
కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి
అది ఆరని హారతి..
ఇదేమి లాహిరీ..ఇదేమి గారడీ
ఎడారి లోన పులు పూచి ఎంత సందడి
ఇదేమి లాహిరీ...మ్మ్ మ్మ్ మ్మ్ లలాలలాలలాల మ్మ్
Labels:
Hero::Jaggayya,
P.Suseela,
Singer::Ghantasaala,
ఈడూ-జోడు--1963
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
పల్లవి లోను ఇతర చోట్ల - "ఇంత సందడి" కు బదులు "ఎంత సందడి" అని: మొదటి చరణం మూడవ పంక్తిలో "చెలికీ" బదులు "చెలిమి"; అని వుండాలి.
థాంక్స్ సో మచ్ సూర్యనారాయణగారు
కాళహస్తీ మహత్యం పాటలు కాస్త చూడండీ ప్లీజ్ _/\_
Post a Comment