సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల
ఓ..హో..ఓ..ఓ..హో..హో..ఓ..ఓ..
ఒ..హో..హో..హో..ఓఓ..ఓఓ..ఓఓ..ఓఓ..
ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఓ..
ఈ నల్లని రాళ్ళలో.....
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి
ఈ నల్లని రాలలో.....
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఏ...
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనె..ఎ..ఎ..ఎ..ఎ..ఎ..
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు
ఈ నల్లని రాలలో.....
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును
ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఓ..
ఈ నల్లని రాళ్ళలో.....
No comments:
Post a Comment