Friday, April 08, 2011

లేత మనసులు--1966





సంగీతం::MS.విశ్వనాథ్
రచన::ఆరుద్ర
గానం::S.జానకి

ఆ..ఆ..ఆఆఆఆ.....
అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి
అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి
మౌనాలు మానాలి..సరసాలె ఆడాలి
నవ్వుల్లొ తేలాలి..ముద్దులరేయి..ఇద్దరమోయి
వద్దనకోయీ...ఈ..ఈ..ఈ..

అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి

లోకాలు నిదురించు..ఏకాంత వేళా..
భావాలు మేలుకొను..బంగారు వేళా..
వరహాల వీణపై..వాయించువేళా..
కవ్వించి..నవ్వించి..కరిగించవేలా..
ఆఆఆఆఆఆఆ..ఆ..ఆ..ఆ..ఆ..

వెలిగే జాబిలీ..మలిగెలోపల..
చవిచూడవోయి విరబూసిన వెన్నెల..
చవిచూడవోయి విరబూసిన వెన్నెల..
నీ చింతదీరా..నా చెంత జేరా..
నీ చింతదీరా..నా చెంత జేరా..
జాగు చేసిన ఆగదు కాలము..
జాగు చేసిన ఆగదు కాలము..

అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి

వయసెమో..సరినేను..మనసేమొ ఉరికేను...
ఆఆఆఆఆఆఆఆఅ..
తడబాటుతో నీ ఒడిలోన ఒరిగెనూ..
లాలించవోయి నామాట లాలించవోయి..
రాగాల ఉయ్యాల లూగించవోయీ..
ఆఆఆఆఆఆఆఆఆఆఆ

వెలిగే జాబిలీ..మలిగెలోపల..
చవిచూడవోయి..తియతీయని తీనెలు
పైపైకి నీవూ..అలవోలెరాగా..
లోలోన నేనూ..సోలిసోలిపోయేను


మౌనాలు మానాలి..సరసాలె ఆడాలి
నవ్వుల్లొ తేలాలి..ముద్దులరేయి..ఇద్దరమోయి
వద్దనకోయీ...ఈ..ఈ..ఈ..

అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి

No comments: