Saturday, April 09, 2011

కానిస్టేబులు కూతురు --1963




సంగీతం::R.గోవర్ధనం
రచన::మల్లాదిరామకృష్ణశాస్త్రి
గానం::P.సుశీల,PB.శ్రీనివాస్



చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలకా
చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలకా
మధురాసెలు పంచేవో..నా మనసును చిలికెవో..ఓ...
చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలకా

నీ అడుగుల జాడలలో..నా నీడను కలిపేనా..
నీ అడుగుల జాడలలో..నా నీడను కలిపేనా..
నీ చూపుల కాంతులలో..నా రూపును నిలిపేనా..ఆ..
చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలకా

నా దారిలొ నినుజూచీ..నునుసిగ్గుతొ తొలగేనా..
నా దారిలొ నినుజూచీ..నునుసిగ్గుతొ తొలగేనా..
కలలో నిను కనినంతా..నిజమేయనిపించేనా..

చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా..
మధురాశలు పలికేవో..మా చెల్లిని పిలిచేవో..
చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా..

విరిపూలతొ ఆడునులే..చిరుగాలితొ పాడునులే
విరిపూలతొ ఆడునులే..చిరుగాలితొ పాడునులే
మా చెల్లెలు బాలసుమా..ఏ మెరుగని బేల సుమా..

చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా..
మధురాశలు పలికేవో..మా చెల్లిని పిలిచేవో..
చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా..ఆ..

No comments: