Friday, August 13, 2010

ఇల్లు-ఇల్లాలు--1972























సంగీతం::KV.మహాదేవన్
రచన:;ఆరుద్ర
గానం::P.సుశీల


ఆలుమగల అన్యోన్యం..అంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యం..పాలూ తేనెల మాధుర్యం..2

మగని మనసు తెలిసీ..మసిలే మగువే గౄహలక్ష్మీ
మగువమాట తీర్చగలిగే..మగడె ఇలవేల్పూ
మమతలోన లేని మైకం..మధువులో లేదూ..
కోరుకొన్న మమతలుంటే..కొరతలే రావూ..
ఆలుమగల అన్యోన్యం..అంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యం..పాలూ తేనెల మాధుర్యం

సేవలందున దాసిగా..భావమెరిగిన మంత్రిగా..
వలపులందున రంభగా..వనిత మెలగాలీ..
జీవితమ్మున చెలిడుగా..చేయివీడని సఖుడుగా..
మరులుగొలిపే మరుడుగా..మగడు మెలగాలీ..

మల్లెకన్న తెల్లనైనది..మగని దరహాసం..
మంచుకన్న చల్లనైనదీ..మగువ సంతోషం..
నవ్వులుపూచే నందనవనమే..చక్కని సంసారం..
నందనంలో కల్పతరువే..నాతి సౌభాగ్యం...
ఆలుమగల అన్యోన్యం..అంతులేని ఆనందం
ఆలుమగల అన్యోన్యం..అంతులేని ఆనందం
పండిన వలపులా దాపత్యం..పాలూ తేనెల మాధుర్యం

ఆలుమగలా..అన్యోన్యం.....

No comments: