సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
పల్లవి::
ఓ..హో..ఓ..హో..ఓ..హో...ఆ..హా..ఆహా
ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో
అందాల మాపల్లె అల్లోనేరెల్లో
ఆనాటి రెపల్లె అల్లోనేరెల్లో
ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో
చరణం::1
నీలిమబ్బుల్లోన కనిపించేవి
బాలకృష్ణుని మేని నిగనిగలే
నీలిమబ్బుల్లోన కనిపించేవి
బాలకృష్ణుని మేని నిగనిగలే
అల్లరిగాలిలో..వినిపించేవి
అల్లరిగాలిలో..వినిపించేవి
పిల్లనగ్రోవి..నవ్వడులే
పాల పొదుగులా..ఆలమందలే
పాల పొదుగులా..ఆలమందలే
ఊరించే తీయని కోరికలే
ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో
చరణం::2
తీయమావిళ్ళ తొలకరిపూతలూ
తెలుగు కన్నియల తొలిసిగ్గులే
తీయమావిళ్ళ తొలకరిపూతలూ
తెలుగు కన్నియల తొలిసిగ్గులే
చిలిపిగపాడే..కలికి కోయిలలూ
చిలిపిగపాడే..కలికి కోయిలలూ
పలికేది నెరజాణ భావాలే
ఏటితరగలా..నీటినురగలా
ఏటితరగలా..నీటినురగలా
మెరిసేవి..పరువాల..చిరునవ్వులే
ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో
ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో
అందాల మాపల్లె అల్లోనేరెల్లో
ఆనాటి రెపల్లె అల్లోనేరెల్లో
ఓహో..ఓ..ఓ...ఓ..ఓహో..ఓ..ఓహో
ఓహో..ఓ..ఓ...ఓ..ఓహో..ఓ..ఓహో
No comments:
Post a Comment