Thursday, August 12, 2010

మానవుడు దానవుదు --1972


















సంగీతం::అశ్వద్ధామ
రచన::C.నారాయణ రెడ్డి
గానం::L.R.ఈశ్వరీ


కంచెకాడ..మంచెకాడ..కందిచేను..గుబురుకాడ
యేటికాడ..గున్నమామి..తోటకాడ..సందెకాడ
మాటువేసాను పోంచి చూసాను దారికాచాను..హా..
నీకోసం..నీసోకైన..మగసిరికోసం..నీకోసం..2

చింతల రైక తొడిగి..సిమ్హాచలం నేను పోతే
గుంటనక్క గుర్రుమన్నదీ..గుండెల్లోనే ఝల్లుమన్నదీ
అప్పుడు నేనేం చేసాను..అన్నిదిక్కులు చూసానూ
తళుక్కుమని ఒక మెరుపు మెరవగా..దౌడుతీసి ఇటువచ్చాను

రంగురంగుల కోకగట్టి..ఒంగోలుకు నే పోతే..2
పోట్లగిత్త ఎదురుపడ్డది..గుబులు గుబులై నామనసు చెడ్డది..2
అప్పుడు నేనేమి చేసాను..అమ్మమ్మను తలపోసానూ..
గిత్తనువంచే మొనగాడననీ..తత్తరపడి ఇటువచ్చానూ..
నీకోసం..నీసోకైన..మగసిరికోసం..నీకోసం..2

కన్యసిగలో పూలుపెట్టి..వరంగల్‌కు నేపోతే..
కొడెకాడే నన్ను కొట్టేనే..వాడా వాడా నవ్వు కట్టెనే
అప్పుడు నేనేమయ్యాను..అవిరావిరైపోయాను..
ఈ దోరవయసి నను బతకనివ్వదని..ఊరువిడిచి..ఊరికొచ్చానూ..
నీకోసం..నీసోకైన..మగసిరికోసం..నీకోసం..
2

No comments: