Thursday, August 12, 2010

వైశాలి--1988



సంగీతం::రవి
రచన::రాజశ్రీ
గానం::చిత్ర
Cast::Sanjay, Suparna, Geetha

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

చరణం::1

సగమద మగస గమదని గమగ
మదరిస నిదమద స
ఆడే మయూర బాల పురివిప్పి చెంత తాను
విరిసెను పూలలో గారాలీ వేళ
మధువులు కురిసే పెదవులలోన
మధురస్వరాలు సాగేను ఈ వేళ
ఓ గండు కోయిల జతకోరి పాడింది
అది విని ఆడింది ఓ కన్నె కోయిల
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

చరణం::2

నక్షత్రమాల నేడు ఆకాశవీధిలోన
కాంతుల విరివాన కురిపించేనులే
కలలే రగిలి అలలై కదిలి
ఊహలు నాలోన ఉరికెనులే
హంసలు జతచేరి ఆనందమున తేలి
మనసార విహరించె మధురిమలో
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

No comments: