Wednesday, August 25, 2010

విచిత్రబంధం--1972




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


అందమైన జీవితమూ..అద్దాల సౌధము
చిన్న రాయి విసిరినా..చెదరిపోవును
ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును

అందమైన జీవితమూ అద్దాల సౌధము
చిన్న రాయి విసిరినా చెదరిపోవును
ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును
అందమైన జీవితమూ..అద్దాల సౌధము

నిప్పు వంటి వాడవు..తప్పు చేసినావు
ఎంత తప్పు చేసినావు
క్షణికమైన ఆవేశము..మనుసునే చంపింది
నిన్ను పసువుగా మార్చింది

నీ పడచుదనం దుడుకుతనం..పంతాలకు పోయింది
పచ్చనైన నీ బ్రతుకును..పాతాళానికి లాగింది
నిన్ను బలిపసువుగా మార్చింది
అందమైన జీవితమూ..అద్దాల సౌధము

ఎవరిది ఈ నేరమని ఎంచి చూడదూ..లోకం ఎంచి చూడదూ
ఏదో పొరపాటని మన్నిచదూ..నిన్ను మన్నిచదూ

అరిటాకు వంటిదే ఆడదాని శీలమూ
అరిటాకు వంటిదే ఆడదాని శీలమూ
ముల్లు వచ్చి వాలినా..తాను కాలు జారినా
ముప్పు తనకే తప్పదు..ముందు బ్రతుకే ఉండదూ

ఛిన్న రాయి విసిరినా చెదరిపోవునూ
ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును
అందమైన జీవితమూ..అద్దాల సౌధము

1 comment:

Anonymous said...

Nagaraju please dont spam