Tuesday, August 24, 2010

చక్రధారి--1977





సంగీతం::G.K.వేంకటేష్
రచన::D.సినారె
గానం::P.సుశీల

పల్లవి::


నాలో ఏవేవో వింతలూ గిలిగింతలూ ఈవేళా
అడుగుల అలజడిలో..తలపుల వరవడిలో
చెలరేగే తుళ్ళింతలు..చెలరేగే తుళ్ళింతలూ

వయసొచ్చిందే పిల్లా..వరదొచ్చిందే పిల్లా
ఆపైన ఓయమ్మా..అల్లోనేరేళ్ళో ఈపైన ఓపలేని ఎన్ని పరవళ్ళో
ఆహహా...ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ

చరణం::1

తొలకరి గాలి తొందరలాయే
ఉలిపిరిపైటామెలికువలాయే
తొలకరి గాలి తొందరలాయే
ఉలిపిరిపైటామెలికువలాయే
ఆహా..
మబ్బులు చూస్తుంటేమగతే వస్తుంటే
మబ్బులు చూస్తుంటేమగతే వస్తుంటే
నేలకరిగిపోయే..అరికాలు నిలవదాయే
ఏమాంటావే..ఏమంటావే..
ఈ మేనిలోని మెరుపులెందుకంటావే

వయసొచ్చిందే పిల్లా..వరదొచ్చిందే పిల్లా
ఆపైన ఓయమ్మా..అల్లోనేరేళ్ళో ఈపైన ఓపలేని ఎన్ని పరవళ్ళో

చరణం::2

తరగల్లోన తనువేమాయే
పరువంపొంగీ నురుగైపోయే ..అహాహా అహా..
తరగల్లోన తనువేమాయే
పరువంపొంగీ నురుగైపోయే ..అహాహా అహా..
నీళ్ళకు వళ్ళుస్తే..జల్లుకు మనసిస్తే..
నీళ్ళకు వళ్ళుస్తే..జల్లుకు మనసిస్తే..
చల్లని సెగలాయే ఎద ఝల్లని గుబులాయే
ఏమంటావే ఏమంటావే..
ఈ వింతవింత విసురులు ఎందుకంటావే

వయసొచ్చిందే పిల్లా..వరదొచ్చిందే పిల్లా
ఆపైన ఓయమ్మా..అల్లోనేరేళ్ళో ఈపైన ఓపలేని ఎన్ని పరవళ్ళో

నాలో ఏవేవో వింతలూ గిలిగింతలూ ఈవేళా
అడుగుల అలజడిలో..తలపుల వరవడిలో
చెలరేగే తుళ్ళింతలు..చెలరేగే తుళ్ళింతలూ

No comments: