సంగీతం::అశ్వద్ధామ
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
అమ్మలాంటి చల్లనిదీ...
లోకమొకటే వుందిలే...
ఆకలి ఆ లోకంలో...ఆ..ఆ..ఆ..
లేనే లేదులే..లేనే లేదులే...
అమ్మలాంటి చల్లనిదీ..లోకమొకటే వుందిలే...
మమతలే..తేనెలుగా...
ప్రేమలే..వెన్నెలగా...2
చెలిమి..కలిమీ..కరుణా..
కలబోసినలోకమదీ..కలబోసినలోకమదీ
మానవుడు దానవుదు
అమ్మలాంటి చల్లనిదీ..లోకమొకటే వుందిలే...
పిడికెడు మెతుకులకై...
దౌర్జన్యం దోపిడీలి...2
కలతలూ..కన్నీళ్ళూ...
కనరానిలోకమదీ..కనరానిలోకమదీ...
అమ్మలాంటి చల్లనిదీ..లోకమొకటే వుందిలే...
ఆకలితో..నిదురపో...
నిదురలో..కలలుకనూ...2
కలలో ఆ లోకాన్నీ...
కడుపునిండ నింపుకో..కడుపునిండ నింపుకో...
అమ్మలాంటి చల్లనిదీ..లోకమొకటే వుందిలే...
ఆకలి ఆ లోకంలో...ఆ..ఆ..ఆ..
లేనే లేదులే..లేనే లేదులే...
అమ్మలాంటి చల్లనిదీ..లోకమొకటే వుందిలే...
No comments:
Post a Comment