Tuesday, August 10, 2010

మానవుడు దానవుదు --1972
















సంగీతం::అశ్వద్ధామ
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు


అణువూ అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువూ అణువున వెలసిన దేవా

మనిషిని మనిషే కరిచేవేళా
ద్వేషము విషమై కురిసేవేళా
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చీల్చి
అమరజీవులై వెలిగిన మూర్తులు
అమౄత గుణం మాకందించరావా
అణువూ అణువున వెలసిన దేవా...

జాతికి గ్రుహణం పట్టిన వేళా
మాత్రు భూమి మొర పెట్టిన వేళా
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించరావా
అణువూ అణువున వెలసిన దేవా...

వ్యాధులు బాధలు ముసిరేవేళా
మౄత్యువు కోరలు చాచేవేళా
గుండెకు బదులుగా గుండెను పోదిగి
కొన ఊపిరులకు వూపిరిలూది
జీవన దాతవై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించరావా
అణువూ అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువూ అణువున వెలసిన దే
వా

No comments: