Friday, December 25, 2009
మంచివాడు --- 1974
సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది
అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు
అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు
కోటేరులాంటి ముక్కు కోలకళ్ళు
లేత కొబ్బరంటి చెక్కిళ్ళు చిలిపి నవ్వులు ..2
ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు..2
ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో సిరులు
అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది
దోబూచులాడు కళ్ళు దొంగ చూపులు
తియ్యతియ్యని మాటలు తెలివితేటలు..2
ఆ మాటలకే పడతారు కన్నె పిల్లలు..2
ఈ ఆత్తగారికప్పుడు ఎందరమ్మా కోడళ్ళు
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది
అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు
నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు
ఊహు మీలాంటి పిల్లాడ్నే కంటాను నేను..అహా..2
ఇద్దర్ని కంటె వద్దన్నదెవరు?
ఆ ఇద్దరు అబ్బాయిలైతేనో?
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది
అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు
అహహా..అమ్మలాగే..వుంటాడు..
మ్మ్..హూ..నాన్నలాగే..వుంటాడు
Labels:
P.Suseela,
Singer::Ghantasaala,
మంచివాడు --- 1974
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment