Friday, December 25, 2009

మంచివాడు --- 1974



సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే
వేరే ఆశ ఉండదు ధ్యాస ఉండదు నువ్వు తోడుంటే..2
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే

మల్లెలుండవు వెన్నెలుండదు నీ నవ్వే లేకుంటే
మనసు ఉండదు మమత ఉండదు నీ మనిషిని కాకుంటే..2
వయసుతో యీ పోరు ఉండదు నీ వలపే లేకుంటే
వలపు ఇంత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే

పొద్దు గడచేపోతుంది నీ నడక చూస్తుంటే
ఆ నడక తడబడిపోతుంది నీ చూపు పడుతుంటే..2
ఆకుమడుపులు అందిస్తూ నువ్వు వగలు పోతుంటే
ఎంత ఎరుపో అంత వలపని..నే నాశపడుతుంట
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే

తేనె కన్న తీపికలదని నీ పెదవే తెలిపింది
దాని కన్నా తియ్యనైనది నీ ఎదలో దాగుంది
మొదటి రేయికి తుదే లేదని నీ ముద్దే కొసరింది
పొద్దు చాలని ముద్దులన్ని నీ వద్దే దాచింది
ఆ ముద్రే మిగిలింది.....
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే
వేరే ఆశ ఉండదు ధ్యాస ఉండదు నువ్వు తోడుంటే
ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే

No comments: