Friday, June 12, 2009
మజ్ఞు ~~రాగం::శివరంజని ~~1989
సంగీతం::లక్ష్మికాంత్ ప్యారేలాల్
రచన::దాసరి నారాయణ రావ్
గానం:::SP.బాలసుబ్రమణ్యం
రాగం::శివరంజని :::(హిందుస్తానీ కర్నాటక)
ఇది తొలిరాత్రీ..కదలని రాత్రీ
ఇది తొలిరాత్రి..కదలని రాత్రి
నీవు నాకు..నేను నీకు..చెప్పుకున్న..కధలరాత్రీ
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ఇది తొలిరాత్రి..కదలని రాత్రి
నీవు నాకు..నేను నీకు..చెప్పుకున్న..కధలరాత్రీ
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలూ మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలూ మూయమన్నదీ
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
దీపమేమో విరబడి నవ్వుతున్నదీ
నీ రాక కొరకు తలుపు..నీ పిలుపు కొరకు పానుపు
పిలిచీ పిలిచి వేచి వేచి ఎదురురు చూస్తున్నవీ
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే
వెన్నెలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
ఆ..ఆ..ఆ..వెన్నెలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
అనురాగం గాలిలో దీపమైనదీ
మమకారం మనసునే కాల్చుతున్నదీ
నీ చివరి పిలుపు కొరకు..ఈ చావు రాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ఇది తొలిరాత్రి ..కదలని రాత్రి
నీవు నాకు..నేను నీకు..చెప్పుకున్న..కధలరాత్రీ
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే
Labels:
SP.Baalu,
మజ్ఞు -1989
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment