Friday, June 12, 2009

మాయా మశ్చేంద్ర--1975:: శ్రీరంజని ::రాగం






సంగీతం::సత్యం
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల

రాగం::శ్రీరంజని

ప్రణయ రాగవాహిని
చెలీ..వసంతమోహిని
ప్రణయ రాగవాహిని
చెలీ..వసంతమోహిని

మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ
ప్రణయ రాగజీవనా
ప్రియా..వసంతమోహినా

మలయ పవన మాలికలూ చెలియా పలికే ఏమని?
మలయ పవన మాలికలూ చెలియా పలికే ఏమని?
పొదరింట లేడు..పూవింటి వాడు
పొదరింట లేడు..పూవింటి వాడు
ఎదురుగా..వున్నాడనీ
ప్రణయ రాగవాహిని
చెలీ..వసంతమోహిని

లలిత శారద చంద్రికలు..అలలైపాడే ఏమనీ?
లలిత శారద చంద్రికలు..అలలైపాడే ఏమనీ?
పదునారు కళలా..పరువాల సిరులా
పదునారు కళలా..పరువాల సిరులా
పసిడి బొమ్మవు నీవనీ

ప్రణయ రాగవాహిని
చెలీ..వసంతమోహిని

మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ

ప్రణయ రాగజీవనా
ప్రియా..వసంతమోహినా

No comments: