Saturday, June 13, 2009

చెల్లెలికాపురం--1971







సంగీతం::K.V.మహదేవన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు

చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన..
కరకంకణములు గల గలలాడగ..
వినీల కచభర..విలాస బంధుర..
తనూలతిక చంచలించిపోగా..

ఆడవే మయూరీ..నటనమాడవే మయూరీ..
నీ కులుకును గని నా పలుకు విరియ..
నీ నటనను గని నవకవిత వెలయగా..
ఆడవే మయూరీ..

అది యమునా సుందర తీరమూ..అది రమణీయ బృందావనమూ..
అది విరిసిన పున్నమి వెన్నెలా..అది వీచిన తెమ్మెర ఊయలా..
అది చల్లని సైకత వేదికా..అట సాగెను విరహిణీ రాధికా..

అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా..

ఆడవే మయూరీ..నటనమాడవే మయూరీ..
నా పలుకులకెనయగు కులుకు చూపి..
నా కవితకు సరి యగు నటన చూపి..
ఇక ఆడవే మయూరీ..నటనమాడవే మయూరీ..

ఫాలనేత్ర సంప్రదవజ్వాలలు ప్రసవశరుని దహియించగా..
పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా..
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా..
ప్రమధనాధ కర పంకజ భాంకృత ఢమరుక ధ్వని వినిపించగా..
ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత
దిక్కటుల వికృత కీంకరుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల

కనులలోన..కనుబొమల లోన..
అధరమ్ములోన..వదనమ్ములోన..
గళసీమలోన..కటిసీమలోనా..
కరయుగములోన..పదయుగములోన..
నీ తనువులోని అణువణువులోన..
అనంత విధముల అభినయించి ఇక ఆడవే..ఆడవే..ఆడవే

No comments: