సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
కల్యాణి రాగం
పరిమళించు వెన్నెల నీవే..మ్మ్
పలకరించు మల్లిక నీవే..మ్మ్
నా జీవన బౄందావనిలో..మ్మ్
నడయాడే..రాధిక నీవే..
కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా..మ్మ్
తొలి చిగురుల చూడగానే..కలకోకిల కూయదా..మ్మ్
కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
తొలి చిగురుల చూడగానే..కలకోకిల కూయదా
అలనాటి జనకుని కొలువులో..మ్మ్
తొలిసిగ్గుల మేలి ముసుగులో..
అలనాటి జనకుని కొలువులో
తొలిసిగ్గుల మేలి ముసుగులో..
ఆ..ఆ..రాముని చూసిన జానకివై
అభిరాముని వలపుల కానుకవై..మ్మ్ హూ
వాల్మీకి కావ్యవాటిక వెలసిన
వసంతమూర్తివి నీవే..
కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
తొలి చిగురుల చూడగానే..కలకోకిల కూయదా
అలనాటి సుందర వనములో..వనములో
ఎల ప్రాయము పొంగిన క్షణములో..
అలనాటి సుందర వనములో..
ఎల ప్రాయము పొంగిన క్షణములో..
ఆ..ఆ..రాజును గనిన శకుంతలవై
రతిరాజు భ్రమించిన చంచలవై..మ్మ్
కాళిదాసు కల్పనలో మెరిసిన
కమనీయ మూర్తివి నీవే...
కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
తొలి చిగురుల చూడగానే..కలకోకిల కూయదా
అజంతా చిత్ర సుందరివై..ఎల్లోరా శిల్ప మంజరివై
అజంతా చిత్ర సుందరివై..ఎల్లోరా శిల్ప మంజరివై
రామప్ప గుడిమోమున విరిసిన రాగిణివై..నాగినివై
అమరశిల్పలకు ఊపిరిలూదిన అమౄతమూర్తివి నీవే..
కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
తొలి చిగురుల చూడగానే..కలకోకిల కూయదా
No comments:
Post a Comment