Tuesday, June 16, 2009

స్నేహం--1977



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
Film Directed By::Baapu
తారాగణం::రావుగోపాల్‌రావు,మాధవి,రాజెంద్రప్రసాద్,సైకుమార్. 

పల్లవి::

పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా
పోయింది పొల్లు..మిగిలిందే చాలు
పోయింది పొల్లు..మిగిలిందే చాలు 
పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా
పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా

చరణం::1

ఎంత మబ్బుమూసినా..ఎంతగాలి వీచినా
నీలినీలి ఆకాశం..అల్లాగే ఉంటుంది 
ఎంత మబ్బుమూసినా..ఎంతగాలి వీచినా
నీలినీలి ఆకాశం..అల్లాగే ఉంటుంది
ఎంత ఏడుపోచినా..ఎంత గుండెనొచ్చినా
ఎంత ఏడుపోచినా..ఎంత గుండెనొచ్చినా
నీలోపల ఉద్దేశం..ఒకలాగే ఉండాలి 
నీలోపల ఉద్దేశం..ఒకలాగే ఉండాలి

పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా
పోయింది పొల్లు..మిగిలిందే చాలు
పోయింది పొల్లు..మిగిలిందే చాలు 
పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా

చరణం::2

కష్టాలే కలకాలం..కాపురముంటాయి
సౌఖ్యాలు చుట్టాలై..వస్తూ పోతుంటాయి
కష్టాలే కలకాలం..కాపురముంటాయి
సౌఖ్యాలు చుట్టాలై..వస్తూ పోతుంటాయి
వెళ్ళాలి బహుదూరం..మోయాలీ పెనుభారం 
వెళ్ళాలి బహుదూరం..మోయాలీ పెనుభారం
ఏమైనా కానీరా..మనయాత్ర మానం 
ఏమైనా కానీరా..మనయాత్ర మానం

పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా
పోయింది పొల్లు..మిగిలిందే చాలు
పోయింది పొల్లు..మిగిలిందే చాలు 
పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా

No comments: