Wednesday, January 21, 2009

మూడుముళ్ళు--1983



సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::జ్యోతిర్మయి
గానం::S.P.బాలు,P.సుశీల

లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా
చలి వెలుగూ..వెన్నెలలూ..నిను తాకగా తగవురా


లేత చలిగాలులూ..హోయ్..దోచుకోలేవులే
మన వలపూ..వాకిలినీ..అవి తాకగా లేవులే

లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా

అందాల నా కురులతో వింజామరలు వీచనా..
అందాల నా కురులతో వింజామరలు వీచనా..
రాగం..భావం..స్నేహం..మోహం..నిన్నే వేడనా


నీ కురుల వీవెనలకు నా హౄదయమర్పించనా..
రూపం..దీపం..శిల్పం..నాట్యం..నీలో చూడనా
కనుల భాష్పాలు..ఆ..హా..
కలల భాష్యాలు..ల ల లా ఒ హో ఓ
వలపులా సాగి..వలలుగా మూగి..
కాలాన్ని బంధించగా


లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా
చలి వెలుగూ..వెన్నెలలూ..నిను తాకగా తగవురా
లేత చలిగాలులూ..అహహ..దోచుకోలేవులే


అధరాల కావ్యాలకూ ఆవేశమందించనా
అధరాల కావ్యాలకూ ఆవేశమందించనా
వలపే పిలుపై..వయసే ముడుపై..నిన్నే చేరనా


మందార ముకుళాలతో పాదాలు పూజించనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై..కలనై..విరినై..ఝరినై..నిన్నే కోరనా
హౄదయనాదాల..ఆ..హా..
మధురరాగాల..ఆహహ..ల ల లా
చిగురు స్వరసాల..నవవసంతాల విరులెన్నో అందించగా


లేత చలిగాలులూ...హోయ్...దోచుకోలేవులే
మన వలపూ...వాకిలినీ...అవి తాకగా లేవులే
ఆ హ హా..హా..హో..మ్మ్..మ్మ్..మ్మ్..

No comments: