Wednesday, January 21, 2009

పండంటి కాపురం--1972



















ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::ఘంటసాల


బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ
కలతలు లేనీ..నలుగురు కలిసీ..సాగించారు పండంటి కాపురం
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ

ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు
ఒక్క బాటపై కలసి నడిచారు వారు
ఆఆ ఆఆ ఆఆ...ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....
ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు
ఒక్క బాటపై కలసి నడిచారు వారు
అన్నంటే తమ్ములకు అనురాగమే...
అన్నకు తమ్ములంటే అనుబంధమే...
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ!!

చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..
చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..
పిల్లలకూ..పెద్దలకూ..తల్లివంటిదీ..ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనదీ
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ!!

అన్న మనసులో వున్నది ఎన్నో కోరికలూ
తమ్ములకు జరగాలి పెళ్ళీ పేరంటాలు
పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలీ
కలకాలం ఈలాగే కలసివుండాలీ
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ
కలతలు లేనీ..నలుగురు కలిసీ..సాగించారు పండంటి కాపురం..
ఆఆ...ఆఆ...ఓఓఓ...ఓఓఓ...!!

No comments: