ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథిగానం::P.సుశీల
Film Directed By::S.R.Puttanna
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,శోభన్‌బాబు,ఎస్.వి.రంగారావు,నాగయ్య,రేలంగి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,
రాజబాబు,రమాప్రభ,రుక్మిణి.
పల్లవి::
అమ్మా..ఆ
పూవులో..గువ్వలో
వాగులో..తీగలో..
అంతట నీవేనమ్మా
అన్నిట నీవేనమ్మా
నీ వడిలో..నన్ను దాచుకోవమ్మా
నీ పాపగా నన్ను చూసుకోవమ్మా..
పూవులో..గువ్వలో
వాగులో..తీగలో
అంతట నీవేనమ్మా
అన్నిట నీవేనమ్మా
నీ వడిలో..నన్ను దాచుకోవమ్మా
నీ పాపగా నన్ను చూసుకోవమ్మా..
చరణం::1
కొమ్మ కొమ్మపై..కుసుమములో..
కమ్మని తేనేవు నీవే నీవే..
జాలి గుండెతో..జలజలపారే
సెలఏరువూ..నీవే..
నింగిలో..నేలలో..రంగు రంగులా
హరివిల్లులో..అంతట నీవే నమ్మా
అన్నిట నీవే నమ్మా..నీవడిలో..
నన్ను దాచుకోవమ్మా..నీ పాపగా..
నన్ను చూసుకోవమ్మా...అమ్మా...
చరణం::2
సీతాకోకా చిలుకలతో
చేరి వసంతాలాడేవూ..
బంగరువన్నెల జింకలతో
చెంగు చెంగున ఎగిరేవు..
కొండలో..కోనలో..తోటలో..బాటలో..
అంతట నీవే నమ్మా
అన్నిట నీవే నమ్మా..నీవడిలో..
నన్ను దాచుకోవమ్మా..నీ పాపగా..
నన్ను చూసుకోవమ్మా
నీ చల్లని నీడే నా ఇల్లు
ఈ మూగజీవులే నావాళ్ళూ
అంతులేని నీ అందాలలోకం
అంతులేని నీ అందాల లోకం
అంతా నాదేనమ్మా...
మనసులో..మమతలో..
కనులలో..నా కలలలో..
అంతట నీవేనమ్మా..అన్నిట నీవేనమ్మా
నీ వడిలో నన్ను దాచుకోవమ్మ..
నీ పాపగా నన్ను చూసుకోవమ్మా..అమ్మా..
No comments:
Post a Comment