Monday, October 06, 2008

దసరాబుల్లోడు--1971




Dasara_Bullodu_Nallavaade by anil4frds





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,S.జానకి


నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

వెన్నెవంటి మనసున్న చిన్నవాడే
చిన్న నాటినుండి నువ్వు కోరుకొన్నవాడే
వెన్నెవంటి మనసున్న చిన్నవాడే
చిన్న నాటినుండి నువ్వు కోరుకొన్నవాడే
ప్రేమకే బానిసైపోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే
ప్రేమకే బానిసైపోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

నువ్వు వాని వరస వున్నదానివీ
నువ్వు వలపుదోచుకొన్నదానివీ
నువ్వు వాని వరస వున్నదానివీ
నువ్వు వలపుదోచుకొన్నదానివీ
మనసిచ్చి మాట పుచ్చుకొంటివీ
నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివీ
మంచితనముతో నువ్వు గెలుచుకొంటివీ
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే


రాధా కౄష్ణులు కథలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధా కౄష్ణులు కథలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధా కౄష్ణుల ప్రేమే పవిత్రమూ
లోకానికే అది ఆదర్శమూ
రాధా కౄష్ణుల ప్రేమే పవిత్రమూ
లోకానికే అది ఆదర్శమూ


గోపాల బాలుడూ...నీ ప్రేమలోలుడూ
గోపాల కృష్ణుడూ...నీ పాలి దేవుడు
గోపాల బాలుడూ...నీ ప్రేమలోలుడూ
గోపాల కృష్ణుడూ...నీ పాలి దేవుడు
వాడు నీ వాడే...కాదు నీ వాడే
వాడు నీ వాడే...కాదు కాదు కానేకాడు
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే...

No comments: