Tuesday, October 07, 2008

బంగారు బాబు--1973



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Director::V.B.Rajendra Prasad
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,జయంతి,రాజబాబు,S.వరలక్ష్మీ,కృష్ణ,శోభన్‌బాబు,
నాగభూషణం,పద్మనాభం.
::::::::

హా హా హా హా హా హా హా హా
శ్రీ రామ చంద్ర నారాయణ...
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా..నాయినా

శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

అయ్యో..శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా


::::1

పగలంతా ఇద్దరమూ ఆలు మగలము
పడుకునే వేళకే పక్కలే దూరము
పగలంతా ఇద్దరమూ ఆలు మగలము
పడుకునే వేళకే పక్కలే దూరము
ఊరి వారికందము ఉత్తుత్తి కాపుర౦
ఊరి వారికందము ఉత్తుత్తి కాపుర౦
నోరూరుతున్న మనకేమో ఓపలేని తాపము
శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

:::2


అన్నిఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాటకోసమే ఆశలన్ని అణుచుకొన్నా
చ్చో..చ్చో..చ్చో..చ్చో..
అన్నిఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాటకోసమే ఆశలన్ని అణుచుకొన్నా

ఉన్నవన్ని ఉన్నట్లే ఊడ్చివ్వాలనుకొన్నా
ఉన్నవన్ని ఉన్నట్లే ఊడ్చివ్వాలనుకొన్నా
కన్నెకున్న హద్దులకు కట్టుబడి ఊరుకొన్నా
శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా
అయ్యయ్యో..శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

::::3


కళ్ళలోకి చూడకు..కాళ్ళు కలిపి నడవకు
మూడు ముళ్ళు పడేవరకు మోమాటం పెట్టకు
కళ్ళలోకి చూడకు..కాళ్ళు కలిపి నడవకు
మూడు ముళ్ళు పడేవరకు మోమాటం పెట్టకు

ఆ మంచి రోజు వచ్చును..హడ్డులేగిరిపోవును
ఆ మంచి రోజు వచ్చును..హడ్డులేగిరిపోవును
కాచుకొన్న వయసు కసి..అప్పుడే తీరును

శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా
ఓహో..శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

No comments: